Today (09-02-23) Stock Market Roundup: చివరి గంట.. లాభాల పంట..

Today (09 02 23) Stock Market Roundup

Today (09 02 23) Stock Market Roundup

Today (09-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ గురువారం నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలు బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు లాభాలు పంచాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్‌ షేర్ల అమ్మకాలు దీనికి ఊతంగా నిలిచాయి. ముఖ్యంగా ట్రేడింగ్‌ చివరి గంటలో బాగా పుంజుకున్నాయి. చివరికి రెండు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్‌ 142 పాయింట్లు పెరిగి 60 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 17 వేల 893 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 17 కంపెనీలు లాభపడగా 13 సంస్థలు నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ తదితర కంపెనీలు రాణించాయి.

read more: India EV Market: ఏటా కోటి విద్యుత్‌ వాహనాల విక్రయాలు

అదానీ గ్రూపు, రెస్టారెంట్‌ బ్రాండ్‌, ఎంఆర్‌ఎఫ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీలు తీవ్రంగా లాసయ్యాయి. సెక్టార్ల వారీగా చూసుకుంటే ఎక్కువ సూచీలు ఫ్లాట్‌గానే క్లోజ్‌ అయ్యాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్‌ అత్యధికంగా సున్నా పాయింట్‌ 7 శాతం వరకు లాభపడింది.

నిఫ్టీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఏసియన్‌ పెయింట్స్‌ తదితర సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హీరో మోటో కంపెనీ, సిప్లా వంటి కంపెనీలు వెనకబడ్డాయి. 10 గ్రాముల బంగారం ధర 57 రూపాయలు పెరిగి గరిష్టంగా 57 వేల 272 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది.

కేజీ వెండి రేటు స్వల్పంగా 33 రూపాయలు పెరిగి అత్యధికంగా 67 వేల 666 రూపాయలు పలికింది. క్రూడాయిల్‌ ధర నామమాత్రంగా 14 రూపాయలు లాభపడి ఒక బ్యారెల్‌ ముడి చమురు 6 వేల 486 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 4 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 54 పైసల వద్ద స్థిరపడింది.