Today (09-02-23) Stock Market Roundup: చివరి గంట.. లాభాల పంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (09-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ గురువారం నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలు బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు లాభాలు పంచాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్ల అమ్మకాలు దీనికి ఊతంగా నిలిచాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చివరి గంటలో బాగా పుంజుకున్నాయి. చివరికి రెండు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 60 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 17 వేల 893 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 17 కంపెనీలు లాభపడగా 13 సంస్థలు నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఏసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు రాణించాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
read more: India EV Market: ఏటా కోటి విద్యుత్ వాహనాల విక్రయాలు
అదానీ గ్రూపు, రెస్టారెంట్ బ్రాండ్, ఎంఆర్‌ఎఫ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీలు తీవ్రంగా లాసయ్యాయి. సెక్టార్ల వారీగా చూసుకుంటే ఎక్కువ సూచీలు ఫ్లాట్‌గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా సున్నా పాయింట్ 7 శాతం వరకు లాభపడింది.
నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏసియన్ పెయింట్స్ తదితర సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటో కంపెనీ, సిప్లా వంటి కంపెనీలు వెనకబడ్డాయి. 10 గ్రాముల బంగారం ధర 57 రూపాయలు పెరిగి గరిష్టంగా 57 వేల 272 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 33 రూపాయలు పెరిగి అత్యధికంగా 67 వేల 666 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 14 రూపాయలు లాభపడి ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 486 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 4 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 54 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!