Today (03-01-23) Business Headlines:
పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ
బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్‌రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సంస్థలో ఇన్వెస్ట్ చేసినవారు తమ వద్ద ఉన్న కోటికి పైగా వాటాలను అమ్మేస్తారు. ఐపీఓలో సమీకరించే నిధులను.. ఫైనాన్సియల్ టెక్నాలజీ ప్రొడక్టుల డెవలప్‌మెంట్‌కి మరియు పాత అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తామని జాగల్ కంపెనీ వివరించింది.
బెట్టింగులను బంద్ పెట్టాలి
బెట్టింగ్‌లను బంద్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు సూచించింది. క్రీడల ఫలితాలపై ఇలాంటి అనారోగ్యకరమైన పోటీల వల్ల జనాలు డబ్బులు కోల్పోతున్నారని తెలిపింది. అందుకే ఆన్‌లైన్ ఆటల సంస్థలకు సెల్ఫ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ను ప్రపోజ్ చేసింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా నిబంధనలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విడుదల చేశారు. గవర్నమెంట్ పర్మిషన్‌తో నడుస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు ఈ ఆర్గనైజేషన్‌లో రిజిస్టర్ అవ్వాలని చెప్పారు. ముసాయిదా నిబంధనలపై ఈ నెల 17 లోగా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
సాటిలేని చెల్లింపులు
యూపీఐ పేమెంట్లు డిసెంబర్‌లో రికార్డు లెవల్‌లో జరిగాయి. మొత్తం 782 కోట్ల ట్రాన్సాక్షన్లు జరగ్గా వాటి విలువ 12 పాయింట్ ఎనిమిదీ రెండు లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక సేవల విభాగం నిన్న సోమవారం వెల్లడించింది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ తొలిసారిగా 2016లో ప్రారంభమైంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లలో సరికొత్త అధ్యయానికి తెర తీసిన ఈ లావాదేవీలు 2022 అక్టోబర్‌లో మొదటిసారి 12 లక్షల మార్క్‌ను దాటాయి. కాలు కదపకుండా సౌకర్యవంతంగా, సురక్షితంగా, ఎక్‌స్ట్రా ఛార్జీలు లేకుండా చెల్లింపులు జరుగుతుండటంతో ప్రజలు ఎక్కువగా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
హైదరాబాద్-ఉత్తర గోవా ఫ్లైట్
ఉత్తర గోవాలో డిసెంబర్ 11న ప్రధాని మోడీ ప్రారంభించిన మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ సర్వీసులు ఎల్లుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఐదో తేదీన గురువారం ఉదయం 9 గంటలకు ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులు ఆ రోజు నుంచే చేరుకోనున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా త్వరలోనే ప్రారంభంకానున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
2 ప్రైవేట్‌వి.. 1 ప్రభుత్వానిది..
ఆర్థిక సత్తా విషయంలో ఆర్‌బీఐ నుంచి అత్యంత విశ్వాసాన్ని చూరగొన్న మూడు ముఖ్యమైన బ్యాంకుల్లో రెండు ప్రైవేట్‌వి కాగా ఒకటి మాత్రమే ప్రభుత్వానిది కావటం గమనించాల్సిన విషయం. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసీఐసీఐ మరియు హెచ్‌డీఎఫ్‌సీ దిగ్గజాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మూడు బ్యాంకులు ఫెయిల్ కావటానికి కూడా వీల్లేనంత పెద్ద బ్యాంకులని కితాబిచ్చింది. వీటిని మరోసారి ప్రత్యేక విభాగం కింద వర్గీకరించింది. ఈ విభాగం పేరును డొమెస్టిక్ సిస్టిమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు అని ఆర్‌బీఐ తెలిపింది.
‘ముందుంది మాంద్యం పండగ’
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాదిలో ముందుంది ముసళ్ల పండగని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ హెచ్చరించింది. 2022తో పోల్చితే 2023లో మూడో వంతు దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనున్నాయని పేర్కొంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ల గ్రోత్ రేట్ పడిపోతుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా చెప్పారు. ఇదిలాఉండగా.. గ్లోబల్ ఎకానమీకి కొన్ని సమస్యలు, ఛాలెంజ్‌లు ఎదురుకానున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం పెద్దగా ఇబ్బందేమీ లేదని అసోచామ్ ధీమా వ్యక్తం చేసింది.
