IMF bailout for Sri Lanka: చుట్టూ ఉండే సముద్రపు నీటి మాదిరిగా.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలతో.. సంక్షోభ సంద్రంలో చిక్కుకున్న శ్రీలంకకు.. IMF రూపంలో శ్రీరామరక్ష లభించింది. ఆ.. ద్వీప దేశానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగేళ్లపాటు అమలుచేయనున్న ఈ బెయిలౌట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తక్షణం 333 మిలియన్ డాలర్లు విడుదల చేయనుంది.
Today (03-01-23) Business Headlines: పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ: బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్‌రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది.