Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కట్టుబడి ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
Read Also: Odisha Assembly Polls: ఒడిశాలో 4 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. షెడ్యూల్ ఇదే..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. 4,892 ఎన్నికైన గ్రామ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం 2024 జనవరిలో ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ మేరకు ఎన్నికల సంఘం శనివారం ప్రకటన చేసింది.
లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో నిర్వహిస్తుండగా.. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!