NTV Telugu Site icon

EVMs: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు.. ఈసీ క్లారిటీ

West Bangal

West Bangal

దేశ వ్యాప్తంగా శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పలు ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు ఉండడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని బాంకురా జిల్లాలోని కొన్ని ఓటింగ్‌ యంత్రాలపై బీజేపీ అని రాసి ఇంగ్లీస్ అక్షరాలు రాసి ఉన్నాయి. దీంతో ఈ ఫొటోలు తీవ్ర కలకలం రేపాయి. ఈవీఎంలపై బీజేపీ అని రాసి ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. తీవ్ర దుమారం చెలరేగడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ ట్యాగ్‌లపై క్లారిటీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Baby Copy Controversy: నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?

ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి బీజేపీ ఓట్ల రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు చెప్పారని.. ఈ రోజు అది బయటపడిందని టీఎంసీ ఆరోపించింది. బాంకురా జిల్లాలోని రఘునాథ్‌పుర్‌లో 5 ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు కన్పించాయని. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’ ట్విట్టర్‌లో డిమాండ్ చేసింది. ఈ పోస్ట్‌కు ఫొటోలను జత చేసింది.

ఫొటోలు కాస్త వైరల్‌గా మారడంతో బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్‌ అడ్రస్‌ ట్యాగ్‌లను ఇస్తుంటామని… వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని తెలిపింది. టీఎంసీ ఆరోపించిన కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారని.. అందుకే ఆయన సంతకం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత పోలింగ్‌ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించినట్లు తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తామన్నారు. ఈ ప్రక్రియంతా వీడియోగ్రాఫ్‌ చేస్తామని.. సీసీటీవీల్లోనూ రికార్డ్‌ అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడున్నాయంటే..?

ఆరో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో తమ్లుక్, కంఠి, ఘటల్, ఝుర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. బంకురాలోని రఘునాథ్‌పూర్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో ఐదు ఈవీఎంలపై బీజేపీ ట్యాగ్‌లు కనిపించడంతో కలకలం రేగింది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

 

Show comments