Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
- రూపాయి ఇస్తే మూడు రూపాయలు వస్తాయని ఆశ
- నిట్టనిలువునా మునిగిపోయిన ఇద్దరు అన్నదమ్ములు
- లారీ కొనుక్కుని బతకాల్సిన వాళ్లు చివరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Counterfeit Money Scam Erpedu: రూపాయి ఇస్తే మూడు రూపాయలు వస్తాయంటే.. లాటరీ అనుకున్నారో లేక అల్లావుద్దీన్ అద్భుత దీపం అనుకున్నారో గానీ ఇద్దరు అన్నదమ్ములు నిలువునా మునిగిపోయారు. లారీ కొనుక్కుని బతకాల్సిన వాళ్లు.. నకిలీ నోట్లను చలామణి చేసి కోటీశ్వరులు అయిపోదామని షార్ట్‌కట్ వెతికారు. తీరా రూ.14 లక్షల అసలు నోట్ల బ్యాగ్‌తో టోల్‌ప్లాజాకు వెళ్తే.. కేటుగాళ్లు కారులో ఎక్కించుకుని మరీ ఉతికి ఆరేశారు. నకిలీ నోట్లు ఇవ్వడం దేవుడెరుగు.. బాధితుల వద్ద ఉన్న అసలు నోట్లను లాక్కుని హైవేపై తోసేశారు. బాధితులు ఏర్పేడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
తిరుపతి జిల్లా తడ మండలం వెల్లూరుపాడు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి, కామిరెడ్డి అన్నదమ్ములు. వీరికి తిరుపతి జీవకోనకు చెందిన గుణశేఖర్రెడ్డి, నెల్లూరు జిల్లా చిల్లాకూరుకు చెందిన శ్రీనివాసులుతో పరిచయం ఉంది. ఈ అన్నదమ్ములు లారీ కొనడానికి రూ.14 లక్షలు సిద్ధం చేసుకున్నారనే విషయం మాయగాళ్లకు తెలిసింది. ఎలాగైనా ఆ డబ్బును కాజేయాలని వారు ఒక ప్లాన్ వేశారు. ‘మీ దగ్గరున్న ఒక రూపాయి అసలు డబ్బు ఇస్తే.. దానికి బదులుగా మూడు రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చేవాళ్లు ఉన్నారు. వాటిని మార్కెట్లో అసలు నోట్లుగా చలామణి చేసుకోవచ్చు’ అంటూ అన్నదమ్ముల చెవుల్లో పూలు పెట్టారు.
Also Read
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- 2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
అంటే రూ.14 లక్షలు ఇస్తే రూ.42 లక్షల నకిలీ నోట్లు వస్తాయని మాయగాళ్లు అన్నదమ్ములకు ఆశ చూపారు. ఈ బంపర్ ఆఫర్ నిజమేనని నమ్మిన అన్నదమ్ములు.. సోమవారం రాత్రి డబ్బుల బ్యాగ్‌తో ఏర్పేడు మండలం మేర్పాక టోల్‌ప్లాజాకు చేరుకున్నారు. అక్కడి నుంచి నిందితులకు ఫోన్ చేయగా.. నకిలీ నోట్లతో కారు వస్తోందని చెప్పారు. రాత్రి 8.30 గంటల సమయంలో తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో అక్కడకు వచ్చింది. అన్నదమ్ములను కారు ఎక్కించుకుని తిరుపతి మార్గంలో బయల్దేరింది. కారు ఏర్పేడు మండలంలోని అంజిమేడు వద్దకు రాగానే అసలు రంగు బయటపడింది.
జాతీయ రహదారిపై కారు ఆపి.. అన్నదమ్ములను చితకబాదారు. వారి వద్ద ఉన్న రూ.14 లక్షల అసలు నోట్ల బ్యాగ్‌ను లాక్కుని రోడ్డుపై తోసేసి పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన అన్నదమ్ములు ఏడుస్తూ.. ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం అర్ధరాత్రి లోపే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆశ ఉండొచ్చు కానీ.. ఈ రేంజ్ అత్యాశ ఉంటే ఇలాగే ఉంటుందని జనం గుసగుస లాడుకుంటున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
-
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!