TTD: భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి.. టీటీడీ కఠిన చర్య.!
- తిరుమలలో భక్తుల నుంచి డబ్బులు వసూలు
- ఘటనపై టీటీడీ కఠిన చర్య
- లగేజీ కౌంటర్ వద్ద పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Action: కలియుగ దేవుడు శ్రీ వెంకంటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో రూల్స్, ఎన్నో సెక్యూరిటీ చెకింగ్స్ అబ్బో.. ఇలా చెప్పుకుంటాపోతే ఎన్నో. అయితే వీటన్నింటిని దాటి స్వామివారిని దర్శించుకుంటే ఆ ఆనందమే వేరు. ఇకపోతే స్వామివారి దర్శనంకు వెళ్లే సమయంలో ఎంటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇంకా మరికొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. అయితే అలాంటి వాటిని దర్శనంకి ముందే భద్రపరుచుకొనేందుకు టీటీడీ కొన్ని ప్రత్యేక సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.
Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
భక్తుల సేవలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ ఈ విషయమై మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని లగేజీ కౌంటర్ వద్ద భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై స్పందించిన టీటీడీ, సంబంధిత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుండి తొలగించింది. అందిన వివరాల ప్రకారం.. తిరుమల లగేజీ సెంటర్‌లో నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు, అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
Yuzvendra Chahal: ఆటగాడే.. ‘చాలా క్యూట్గా ఉన్నావు’ అంటూ మరో వివాదంలో స్టార్ బౌలర్.. వీడియో వైరల్.!
ఈ ఘటనకు సంబంధించి టీటీడీ స్పష్టంగా తెలిపింది ఏమిటంటే.. తిరుమలలో లగేజీ డిపాజిట్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి. భక్తులు తమ సామాను భద్రపరచడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడైనా గమనించిన పక్షంలో వెంటనే విజిలెన్స్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9866898630కు సమాచారం ఇవ్వాలని టీటీడీ భక్తులను కోరింది. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం, సేవల్లో పారదర్శకతను కొనసాగించడం కోసం టీటీడీ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
TTD has removed an outsourcing employee at Tirumala for collecting money from devotees at a luggage counter. Luggage deposit services are free. Devotees are requested to stay vigilant and report violations to Vigilance Control Room: 9866898630.#ttd #tirumala pic.twitter.com/NdCBA1OU6B
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 13, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?