Tirumala Laddu Adulteration Case: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ
- తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పై ప్రభుత్వానికి సిట్ లేఖ..
- జరిగిన పరిణామాలు, దర్యాప్తు లో తేలిన అంశాలు ప్రస్తావించిన సిట్..
- సిట్ లేఖను పూర్తిగా అధ్యయనం చేశాక స్పందించాలనుకుంటున్న ప్రభుత్వ వర్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Adulteration Case: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక లేఖను పంపింది. ఈ లేఖలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సిట్ వివరించినట్టు సమాచారం. సుమారు వంద పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో, 2019–2024 మధ్యకాలంలో తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో చోటుచేసుకున్న అనేక తప్పిదాలను సిట్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అంశాలను కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. కేవలం తప్పిదాలనే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన సరిదిద్దే చర్యలు, పర్యవేక్షణా విధానాలపై కూడా సిట్ సూచనలు చేసింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సిట్ లేఖపై ప్రభుత్వ అధ్యయనం
సిట్ పంపిన లేఖను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే అధికారికంగా స్పందించాలనే నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక అత్యంత సున్నితమైన అంశానికి సంబంధించినదైనందున, తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా అన్ని కోణాల్లో పరిశీలన జరుపుతున్నామని సమాచారం. అయితే, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ తరహా తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
భక్తుల విశ్వాసం, టీటీడీ సంస్థ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తిరుమల లడ్డూ అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిట్ నివేదికపై పూర్తి స్థాయి అధ్యయనం అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రకటించే చర్యలు రాజకీయంగా, పరిపాలనపరంగా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
-
Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్‌లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!