Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Positive Energy at Home: ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో చాలామంది తమ ఇంట్లో ప్రశాంతత, సంతోషం, సానుకూల వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రంగా పేరుగాంచిన వాస్తు, ప్రకృతిలోని కొన్ని మూలకాల మధ్య సమతుల్యతను నెలకొల్పి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పెంపొందించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న మార్పుల ద్వారానే ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గించి, సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చని వారు సూచిస్తున్నారు.
ఇంటి ప్రధాన ద్వారం:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం శక్తి ప్రవేశించే ప్రధాన మార్గంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇంటి ప్రవేశ ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో నిండి ఉండేలా చూసుకోవాలి. పాడైన వస్తువులు, చెత్త బుట్టలు లేదా ఉపయోగించని చెప్పులను ద్వారం దగ్గర ఉంచకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు.
Also Read
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
అనవసర వస్తువులను తొలగించడం:
ఇంట్లో పేరుకుపోయిన అనవసర వస్తువులు, పాడైన సామగ్రి లేదా ఉపయోగించని వస్తువులు స్థిరమైన ప్రతికూల శక్తికి కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడకగదులు, వంటగది, నిల్వ గదులను తరచూ శుభ్రం చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
కళ్లు ఉప్పుతో ప్రతికూలత:
వాస్తు ప్రకారం రాక్ సాల్ట్ లేదా రాయి ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించే గుణం కలిగి ఉంటుందని భావిస్తారు. ఇంటి మూలల్లో చిన్న గిన్నెలో కళ్లు ఉప్పు ఉంచడం ద్వారా ప్రతికూలత తగ్గుతుందని చెబుతారు. ప్రతి వారం ఆ ఉప్పును మార్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి నేలను శుభ్రం చేసే నీటిలో కొద్దిగా కళ్లు ఉప్పు కలపడం కూడా మంచి శుభ్రతను అందిస్తుందని నమ్ముతారు.
సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి:
సహజ కాంతి, స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి సమృద్ధిగా వచ్చేలా చూడటం ఎంతో ముఖ్యమని వాస్తు సూచిస్తుంది. చీకటి, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు ప్రతికూల వాతావరణానికి కారణమవుతాయని అనుకుంటారు. కిటికీలు తెరిచి ఉంచడం, గాలి ప్రసరణకు అవకాశం కల్పించడం ద్వారా ఇంటి వాతావరణం తాజాగా మారుతుంది.
ఇంట్లో పచ్చని మొక్కలు:
కొన్ని ఇండోర్ మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచడమే కాకుండా గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. తులసి, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కలు ఇంటికి మంచి శక్తిని తీసుకువస్తాయని భావిస్తారు. అయితే ముళ్లు ఉన్న మొక్కలను ఇంటి లోపల ఉంచకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!