Rayapati Sailaja: అనంతపురం జిల్లా రామగిరిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని విచారకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా “కాలం బాగోలేదు… అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి” అంటూ ఆమె సూచనలు చేశారు. అయితే, తన ప్రసంగంలో మైనర్ బాలిక పేరు బయట పెట్టిన శైలజ, అది పొరపాటుగా జరిగిందని క్షమాపణ తెలిపారు. కానీ ఆమె వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వివాదం చెలరేగింది.
Read also: Kalpika pub incident : పబ్ లో గబ్బు.. కల్పికపై కేసు
గతంలో ఓ కేసులో బాధితురాలు పేరు చెప్పారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. గతంలో తనపై బాధితురాలి పేరు చెప్పినట్టు కేసు పెట్టారని గుర్తు చేస్తూ, రాయపాటి శైలజపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు అరికట్టాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజను దళిత సంఘాలు అడ్డుకున్నాయి. ఇదిలా ఉంటే, బాధిత బాలిక కుటుంబ సభ్యులు మొదట బాలు అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దానినే ప్రాధాన్యతగా తీసుకుని విచారణ సాగించారు. దీంతో అసలైన నిందితుడు నరేష్‌ను గుర్తించడంలో ఆలస్యం అయ్యిందని శైలజ పేర్కొన్నారు.
Read also: America vs Iran: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. సైన్యాన్ని వెనక్కి పిలిచిన ట్రంప్
ఇంటర్ విద్యార్థిని తన్మయి కేసులో మొదట బాలు అనే యువకుడిపై పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాలుపై పోలీసులు ఫోకస్ చేశారు. అందుకే నిందితుడు నరేష్ ను గుర్తించడం ఆలస్యమైంది. ఇప్పటికే పోలీసు నిర్లక్ష్యంపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను సస్పెండ్ చేశారు. రామగిరి మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితులను పట్టుకున్నాం…16 మందిని అరెస్ట్ చేసాం. రామగిరి దళిత మైనర్ బాలిక ఘటనలో పార్టీలకు సంబంధం లేదని అన్నారు. ఒక్క పక్క దర్యాప్తు కొనసాగుతుండగా, మరో పక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ వ్యాఖ్యలు, ఆమెపై నిరసనలు ఈ ఘటనకు కొత్త మలుపు తిప్పాయి.