Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim David Cigar Celebration: ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సంబరాలు ఇంకా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ఆ వేడుకల మధ్య ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (Tim David) మరోసారి వివాదాల కేంద్రంగా మారాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ సంబరాల సందర్భంగా టిమ్ డేవిడ్ సిగార్ తాగుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఫైనల్ విజయం అనంతరం మైదానంలోనే సిగార్ కాలుస్తూ టిమ్ డేవిడ్ సంబరాలు చేసుకోవడం అభిమానుల కంటపడింది. ఆస్ట్రేలియా క్రికెట్లో టైటిల్ గెలిచిన తర్వాత సిగార్‌తో సెలబ్రేషన్స్ చేయడం సాధారణ సంప్రదాయంగా భావిస్తారు. ఇదే క్రమంలో డేవిడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా నోట్లో సిగార్ పెట్టుకుని ట్రోఫీతో కలిసి ఫిల్ సాల్ట్‌తో పోజులు ఇచ్చిన ఫోటోలను పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో డేవిడ్‌పై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత, ప్రెజెంటేషన్ కార్యక్రమం అనంతరం జరిగే సంబరాల్లో సిగార్ తాగడాన్ని నిషేధించే ప్రత్యేక నిబంధనలు లేవు. ఈ చర్య ఆట జరుగుతున్న సమయంలో కాకుండా మ్యాచ్ అనంతరం జరిగినందున శిక్ష పడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
అయితే టిమ్ డేవిడ్‌కు ఈ సీజన్లో వివాదాలు కొత్తేమీ కావు. ఇటీవల ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసభ్యకర సంజ్ఞలు చేసినందుకు కూడా ఆయనపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ సీజన్లోనే ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రిక్ సిగెరెట్ తాగుతూ కెమెరాకు చిక్కడంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అయితే ఆ ఘటన మ్యాచ్ జరుగుతున్న సమయంలో చోటుచేసుకోవడం వల్లే చర్యలు తీసుకున్నారు.
టిమ్ డేవిడ్ తాజా వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ఆస్ట్రేలియన్ సెలబ్రేషన్ కల్చర్‌లో భాగంగా సమర్థిస్తుండగా, మరికొందరు యువతకు తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క