NTV Telugu Site icon

IPL 2023 : మూడేండ్ల తరువాత ఉప్పల్ లో ఐపీఎల్ సంబురం

Srh Vs Rr

Srh Vs Rr

మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ లో జరిగే తొలి మ్యాచ్ లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రౌండ్ చుట్టు పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 7 అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు.

Also Read : LSG vs DC : 50 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం

మరోవైపు నగరం నలువైపుల నుంచి వచ్చే ప్రేక్షకుల కోసం ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను గ్రేటర్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. రద్దీకనుగుణంగా ప్రతి 5,3,2 నిమిషాలకు ఒకటి చొప్పున అదనంగా మెట్రో రైళ్లను కూడా నడిపించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో బందోబస్తు ఏర్పాట్లను ఇప్పటికే రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ పర్యవేక్షించారు. ఈ మ్యాచ్ కు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Also Read : కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం 1500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేట్టారు. మ్యాచ్ సందర్భంగా నిర్ధేశించిన పార్కింగ్ స్థలాలు, పోలీసులు సూచించిన ప్రవేశమార్గం, బయటికి వెళ్లే మార్గాల్లోనే ప్రేక్షకులు వెళ్లాలని అధికారులు తెలిపారు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలను ఈవ్ టీజింగ్ నియంత్రణకు ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

Also Read : Roti: పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గ్యాస్‌పై కాల్చకండి..

ల్యాప్ టాప్ లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమరాలు, సిగరేట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పదునైన మెటల్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, హెల్మెట్లు, బ్యాగులు, తదితర వస్తువులు స్టేడియంలోకి అనుమతించరు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్ లు జరుగనున్నాయి. మ్యాచ్ కు సంబంధించిన భద్రత ఏర్పాట్లు హెచ్ సీఏ పర్యవేక్షిస్తున్నది. ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ నేపథ్యంలో స్టేడియాన్ని విభిన్న రంగులతో ముస్తాబు చేశారు.

Also Read : Killers of the Flower Moon: లియోనార్డో – మార్టిన్ అంత ‘పెద్దది’ చేశారా!?

ఇష్టమైన క్రికెటర్ల ప్లకార్డులు, విభిన్న రకాల వేషధారణ, చీర్ గర్ల్స్ స్టెప్పులు, తదితర దృష్యాలన్నీ స్టేడియంలో ఆవిష్కృతం కానున్నాయి. టికెట్స్ బుక్ చేసుకోవడంలో అభిమానులు బిజీగా ఉన్నారు. రూ. 800 నుంచి టికెట్ ధరలు ఉన్నాయని బుక్ చేసుకున్న వారికి మ్యాచ్ జరిగే 72 గంటల ముందర టికెట్ హార్డ్ కాపీ పంపిస్తున్నామని హెచ్ సీఏ వెల్లడించింది.

Show comments