భారతీయ వంటల్లో కరివేపాకుకు చాలా ప్రాధాన్యం ఉంది. 

ముఖ్యంగా పప్పు, సాంబార్ వంటల్లో ఇది లేకుంటే రుచే లేదు.

కరివేపాకులో విటమిన్ ఏ, కె, బి ఉంటాయి. ఐరన్, కాపర్, పాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. 

బరువు తగ్గించడం, శరీర జీవక్రియలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. 

యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందొచ్చు. 

డయేరియా, ఎసిడిటీ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. 

శరీరంలో షుగర్ లెవన్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఇందులో ఉండే ఏ విటమిన్ కంటి చూపుకు మంచిది. కంటిశుక్లాలు రాకుండా నిరోధిస్తుంది.