NTV Telugu Site icon

Tiger: అడవిపందిని చంపిన పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు

Tiger

Tiger

Tiger: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజు ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది మాంసాన్ని తిని పెద్దపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ ఘటనను చూసిన రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులకు ఈ ఘటన కనిపించింది. మామిడి తోటలో పులి గాండ్రింపులు విన్న రైతులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

Read Also: Telangana Electricity: డైరెక్ట్‌గా ఫోన్‌ కే కరెంట్‌ సమాచారం.. టైం కి పనులు చేసుకోవచ్చు..

నిన్నటి వరకు మాతంగి మెట్ట వద్ద హల్చల్ చేసిన పెద్దపులి నేడు 5 కిలోమీటర్ల సమీపంలో కరగపాడు అనే గ్రామంలో అడవి పంది పై దాడి చేయడం అక్కడ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పంట పొలాల మీద ప్రయాణించిన పులి అడుగుజాడలు క్లుప్తంగా కనిపించడంతో రైతులలో అలజడి మొదలైంది. అటవీశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై పలు గ్రామస్తులు మండిపడుతున్నారు.