Telangana Electricity: పెళ్లి, ఫంక్షన్ వంటి ముఖ్యమైన పనుల సమయంలో కరెంట్ పోతే ఇబ్బంది మాములుగా ఉండదు. పవర్ ఆఫీస్ కు కాల్ చేసిచేసి అబ్బా ఈరోజు ఎప్పుండు వస్తుందో ఏంటో అనుకుంటూ ఆరోజంతా గడపేస్తుంటాము. ఒక వేళ కరెంట్ ఉండదని ముందే తెలిస్తే తదనుగుణంగా ప్లాన్ చేస్తాం లేదా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ సర్వసాధరంగా మారింది. ప్రతి పనికి ఫోన్ తప్పనిసరిగా మారుతుంది. కావున కరెంట్ అధికారులకు ఒక ఆలోచన వచ్చింది. పవర్ కట్ విషయాన్ని ఫోన్ ద్వారా ప్రజలకు తెలిపేందుకు ప్లాన్ వేస్తున్నారు. ప్రతి పనికి ప్రజల చేతిలో వుంటే ఫోన్ కే పవర్ కట్ విషయం తెలిస్తే బాగుంటుందని ప్లాన్ లో వున్నారు. కాబట్టి.. మీ మొబైల్‌లో ప్రస్తుత సమాచారంతోపాటు బిల్లులు కూడా రావాలంటే.. ఈ ఒక్క పని చేయాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
Read also: Gold Price Today : బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించినా చాలా మందికి సమాచారం అందలేదు. దాంతో.. ఆ సమయంలో ముఖ్యమైన పని ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా.. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడే సమయానికి సంబంధించిన సమాచారం నేరుగా మన ఫోన్‌కు అందితే.. అందుకు అనుగుణంగా పని చేయవచ్చు.. లేదంటే ఆ సమయానికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యుత్ వినియోగదారుల కోసం విద్యుత్ శాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఈ సదుపాయం కోసం విద్యుత్ వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను సంబంధిత మీటర్లకు అనుసంధానం చేసుకోవాలని ఆయా విద్యుత్ సంస్థల అధికారులు సూచిస్తున్నారు. ఫోన్ నంబర్‌ను లింక్ చేసిన వారి మొబైల్ ఫోన్‌కు నేరుగా మెసేజ్ వస్తుందని, ఎప్పుడు కరెంటు ఉంటుంది, ఎప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందో తెలియజేస్తుందని అధికారులు వివరిస్తున్నారు. కరెంట్ కట్ సమాచారంతో పాటు బిల్లు వివరాలను కూడా మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అయితే వినియోగదారులు tssouthernpower.com వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఫోన్ నంబర్‌ను లింక్ చేయాలని విద్యుత్ అధికారులు సూచించారు. అంతే కాకుండా.. కరెంట్ మీటర్ రీడర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు.. ఫోన్ నంబర్ ఇచ్చినా ఈ సౌకర్యం పొందవచ్చని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
Medaram Jatara: ‘గేట్ వే ఆఫ్ మేడారం’ గురించి తెలుసా..! తొలి మొక్కు అక్కడే..