Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం కలకలం
- 'హనుమాన్' ప్రత్యేక బృందాలు రాత్రంతా నిఘా
- డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Spotted Near Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం నెలకోట–పూడిపల్లి టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని అటవీ శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘హనుమాన్’ ప్రత్యేక బృందాలు రాత్రంతా అప్రమత్తంగా నిఘా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ దళాధిపతి పి.వి. చలపతిరావు, ప్రధాన అటవీ సంరక్షణాధికారి ఎన్. నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ప్రధాన అటవీ సంరక్షణాధికారి డా. జ్యోతి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫీల్డ్ బృందాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
అలాగే బెంగళూరు నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణుల బృందం కూడా ఆపరేషన్లో పాల్గొని సాంకేతిక సలహాలు అందిస్తోంది. రంపచోడవరం డీఎఫ్వో రామచంద్రరావు స్వయంగా ఘటనాస్థలంలో మకాం వేసి ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు, లైట్లు, శబ్ద పరికరాల సహాయంతో పులి గ్రామాల వైపు కదలకుండా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కాలినడకన కొండ ప్రాంతాలకు చేరుకుని పులి కదలికలను సమీపం నుంచి గమనిస్తున్నారు. గ్రామాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు గుంపులుగా చేరవద్దని, పులిని చూడటానికి ప్రయత్నించవద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు