NTV Telugu Site icon

West Bengal: శివుడికి గంగాజలం తీసుకొస్తామని వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

River

River

పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అసన్సోల్ కు చెందిన విద్యార్థి కాజు ఘోష్ కి శివునికి జలాభిషేకం చేయాలని కోరిక ఉంది. కానీ అతని కోరిక తీరక ముందే.. విగతజీవిగా మారిపోయాడు. అయితే శ్రావణ మాసంలో సోమవారం నాడు చాలా మంది ప్రజలు శివునికి గంగాజలాన్ని సమర్పిస్తారని.. అందుకోసం ఆ యువకుడు నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. శివునికి జలాన్ని సమర్పించాలన్న కాజు ఘోష్ కల నెరవేరలేదు. స్నేహితులతో కలిసి ఉదయం 6 గంటల ప్రాంతంలో అజయ్ నదికి వెళ్లారు. స్నేహితులందరూ స్నానాలు చేశారు. అయితే కాజు ఘోష్ మాత్రం శివుడికి గంగాజలం తీసుకురావడానికని నదిలోకి దిగాడు. అయితే అతనికి ఈత రాకపోవడంతో నదిలో మునిగిపోయాడు. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు అతన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్లు తెలిసింది. ఆ విద్యార్ధి మృతితో.. వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

Colors Swathi: విడాకుల రూమర్స్.. బుర్ఖా వేసుకొని తప్పించుకున్న హీరోయిన్..?

మరో ఘటన ముర్షిదాబాద్‌లోని బహరంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ఘాట్‌పోర్ట్‌లోని నియాలిస్ పడ ఫెర్రీ ఘాట్ వద్ద జరిగింది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఐదుగురు స్నేహితులు బయాస్‌పూర్ ఆలయంలో శివుడికి గంగాజలం తీసుకొస్తామని వెళ్లి.. ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా నీటిలో మునిగి చనిపోయారు. ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో.. అతన్ని కాపాడటానికి వెళ్లి.. మరో ఇద్దరు స్నేహితులు నదిలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం రేపింది. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.