Tragic Incident: ఇంటిపై ఉన్న బండరాయిని కదిలించిన కోతులు.. మూడేళ్ల చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
monkeys send boulder rolling down from roof: ఇంటి పైకప్పుపై వేసిన బండరాయి బోల్తా పడి తలపై పడడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అక్కన్నపేటలోని కటుకూరి గ్రామ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోతులు ఆడుకుంటూ పైకప్పుపైకి దూకడం వల్ల బండరాయి బోల్తా పడింది. ఆ సమయంలో రజిత, శ్రీకాంత్ దంపతుల కుమారుడు దేవునూరి అభినవ్ తన ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి బాలుడి తలపై పడింది. బండరాయి తలపై పడడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి బాలుడు విగతజీవిగా కనిపించడంతో వారు బోరున విలపించారు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Metro Train : మెట్రో రైలులో లేని సీటు..సోఫాతో ప్రయాణం చేస్తున్న యువకుడు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం అభినవ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ బాలుడికి ప్రమాదవశాత్తు కత్తి గొంతు గుచ్చుకుంది. రూ. 5 లక్షలతో శస్త్రచికిత్స చేయించి తల్లిదండ్రులు కుమారుడిని కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆ కత్తి గాయాల నుంచి పూర్తిగా కోలుకోగా.. మళ్లీ ఇప్పుడు ఆ సంఘటనను మరిచిపోకముందే మృత్యువు బాలుడిని వెంటాడింది. ఈ నేపథ్యంలో బాలుడి తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది. చాలా కాలంగా కోతుల బెడదతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు వాపోయారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!