Trans Gender: ఎస్సై ఉద్యోగం సాధించిన ముగ్గురు ట్రాన్స్ జెండర్స్..ఎక్కడంటే..?
- బీహార్ పోలీస్ అండర్ సర్వీస్ కమిషన్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ పరీక్ష ఫలితాల విడుదల
- ఫలితాల్లో విజయం సాధించిన ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు
- యునిఫాం వేసుకోబోతున్న బీహార్ భాగల్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాన్వి మధు కశ్యప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాన్స్ జెండర్స్ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న విషయం తెలిసిందే. వారు ఎక్కడ కనిపించిన ఆదరించే వారి కంటే చీదరించుకునే వాళ్లు ఎక్కువ. ట్రాన్స్ జెండర్లలో కొందరి వల్ల ప్రస్తుతం అందరూ అసమానతలకు గురవుతున్నారు. కానీ బీహార్ రాష్ట్రంలో మాత్రం ట్రాన్స్ జెండర్లు ప్రతిభ కనబరిచారు. ఉన్నత చదువులు చదవటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బీహార్ పోలీస్ అండర్ సర్వీస్ కమిషన్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు విజయం సాధించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా అవతరించారు. ఈ ముగ్గురు ట్రాన్స్‌జెండర్లలో ఇద్దరు ట్రాన్స్ మెన్ కాగా, ఒకరు ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు.
READ MORE: Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?
Also Read
- Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
పరీక్షలకు హాజరైన 6788 మంది అభ్యర్థుల్లో 1,275 మంది అభ్యర్థులు ఉద్యోగం సాధించారు. వీరిలో 822 మంది పురుషులు, 450 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఉద్యోగం సాధించిన వారిలో 275 మంది షెడ్యూల్డ్ కులాలు, 238 మంది EBC, 100 OBC, 87 మంది మహిళలు – 11 EWS, 16 షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు. మధు కాకుండా, మరో ఇద్దరు ట్రాన్స్ రోనిత్, బాంటీ ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్లుగా ఉన్నారు. గతేడాది నిర్వహించిన బీహార్ కులాల సర్వే ప్రకారం రాష్ట్రంలో 40,827 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
READ MORE: Vizag Steel Plant: విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి.. స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఉత్కంఠ..
బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాన్వి మధు కశ్యప్ ట్రాన్స్‌జెండర్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా అవతరించారు. ఐదు పోస్టులు ట్రాన్స్‌జెండర్లకు రిజర్వ్ చేసినప్పటికీ ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. దీంతో మిగిలిన రెండు స్థానాలను జనరల్ కేటగిరీలో చేర్చారు. ఈ సందర్భంగా మధు కశ్యప్ మాట్లాడుతూ.. “సమాజానికి భయపడి ఇన్ని రోజులు బతికాను. ఇంతకుముందు నా తల్లిని కలవడానికి రహస్యంగా పాట్నాకు వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు యూనిఫాంతో మా గ్రామానికి వెళ్తాను. నేను ట్రాన్స్ జెండర్ గా ఉన్నందుకు సిగ్గుపడటం లేదు. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు సాధారణ అమ్మాయి కాదని తేలింది. ఆ తర్వాత క్రమంగా సమాజం నుంచి వెలివేసి నన్ను ఒంటిరిదానిగా చేశారు.” అని ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్‌పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!