నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలను త్వరలోనే నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నారు. 14 నెలల క్రితం నంద్యాల జిల్లా పెద్ద గుమ్మడాపురంలో నాలుగు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఒక పులి పిల్ల చనిపోగా, మిగిలిన మూడు పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా పేర్లు పెట్టారు. ఇప్పుడు పెద్దవవుతున్న ఈ పులి పిల్లలను వేటాడటం నేర్పించేందుకు నల్లమలలోని టైగర్ ఎన్‌క్లోజర్లలో వదిలి పెట్టనున్నారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి.