Hindu Temples Attack In Bangladesh: మూడు హిందూ దేవాలయాలపై దాడి.. ఆందోళనలో ప్రజలు
- బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన
- చిట్టగాంగ్‌లో హింసాత్మక ఘర్షణలు
- మూడు హిందూ దేవాలయాలపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Temples Attack In Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసనల మధ్య చిట్టగాంగ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఇందులో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చిట్టగాంగ్‌లో దుండగులు లోక్‌నాథ్ ఆలయం, ఫిరంగి బజార్‌లోని మానస మాత ఆలయం, హజారీ లేన్‌లోని కాళీ మాత ఆలయాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు, ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. మరోవైపు దేశంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ పాలనలో ఇస్లామిక్ ఛాందసవాదుల నియంత్రణ లేకుండా పోయిందని, దేశంలోని హిందువులను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని దేవాలయాలపై దాడులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత దేశంలో హిందువులపై ఓ రకమైన ‘మారణహోమం’ జరుగుతోంది.
Also Read: Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇస్లామిక్ ఛాందసవాదుల వ్యవస్థీకృత దాడులకు ప్రతిస్పందనగా హిందువులు పెద్ద సంఖ్యలో శాంతియుతంగా నిరసనలు చేయడం మొదలు పెట్టడంతో.. ఇలాంటి చర్యలు ప్రారంభమయ్యాయి. హిందవుల నిరసనలు ప్రధానంగా వారి సామాజిక, మతపరమైన సంస్థ ఇస్కాన్ ద్వారా నిర్వహించబడ్డాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనుచరులు ఉన్న సంగతి తెలిసిందే. నిరసనల దృష్ట్యా, ప్రముఖ హిందూ నాయకుడు అలాగే ఇస్కాన్ సెయింట్ చిన్మోయ్ కృష్ణ దాస్‌ను సోమవారం ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక చిన్మయానంద్ దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లోని ఠాకూర్‌గావ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ మైనారిటీలపై బంగ్లాదేశ్ సైన్యం దాడి చేసింది.
Also Read: Allu Arjun Remuneration: షాకింగ్.. 300 కోట్లు ఏంది సామి?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?