వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత్ రేపు(ఆదివారం) ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి వరల్డ్ కప్ భారత్ నిర్వహిస్తుండటంతో.. ఎలాగైనా కప్ ను సొంతం చేసుకోవాలనే ఆశతో ఉన్నారు టీమిండియా. మరోవైపు రేపటి మ్యాచ్ లో కొందరు ఆటగాళ్లు ఆటడంలేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ముగ్గురు స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
Read Also: Kohli: విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శన.. లాంగ్ డైవ్ ఎలా వేశాడో చూడండి
స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను టీమిండియా సెలక్ట్ చేసింది. అయితే ఈ ముగ్గురు చెపాక్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చవచ్చని రోహిత్ సూచించాడు. చెన్నై మైదానం పిచ్ స్పిన్నర్లకు సహాయకరంగా ఉంటుందని తెలిపాడు. మరోవైపు హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆడకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్నామన్నారు.
Read Also: Yogi Adityanath: సైనికులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం
ఇదిలా ఉంటే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటం రోహిత్‌కి మంచి పేరుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిల్లో మార్పులు ఉండవచ్చని రోహిత్ శర్మ తెలిపాడు. ఇక నేడు నెట్ ప్రాక్టీస్ లో హార్థిక్ పాండ్యా గాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బౌన్సర్ వేయడంతో పాండ్య చేతి వేలికి గాయం కావడంతో అప్పుడే ప్రాక్టీస్ సెషన్ నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు శుభ్ మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. అతను కోలుకునేందుకు పది రోజుల సమయం పట్టనుంది. చూడాలి మరీ రేపు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఉండబోతుందో.
