మణిపూర్‌లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
READ MORE: Disha Patani: ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇప్పిస్తామని దిశా పటానీ తండ్రికి రూ.25 లక్షలు టోకరా
మణిపూర్‌లోని జిరిబామ్‌లో సోమవారం కిడ్నాప్‌కి గురైన ఆరుగురిలో ముగ్గురు మహిళల మృతదేహాలు శుక్రవారం సాయంత్రం అస్సాం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో తేలుతూ కనిపించాయి. వీరు కొన్ని రోజుల క్రితం జిరిబామ్ క్యాంపు నుంచి కిడ్నాప్ చేయబడ్డారు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జిరి నదిలో మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీని తర్వాత అస్సాం రైఫిల్స్ సైనికులు వారిని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు ఇంకా మృతదేహాలను గుర్తించలేదు. కానీ వారి వివరణలు తప్పిపోయిన ఆరుగురిలో ముగ్గురితో సరిపోలుతున్నాయి. నవంబర్ 11 న మధ్యాహ్నం 3:30 గంటలకు జిరిబామ్ జిల్లాలోని బోరోబెకరాలో పోలీసు స్టేషన్‌పై దాడి చేయడానికి వచ్చిన కనీసం 11 మంది సాయుధ కుకీలను భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.