వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీ కొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
READ MORE: Kethika Sharma : నడుము అందాలతో కేక పుట్టిస్తున్న కేతిక..
ఒంటిమిట్ట (మం) నడింపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్ సవిత ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ కు దగ్గరుండి మెరుగైన వైద్యం అందించాలని ఎస్సీ అశోక్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలనీ అధికారులకు సూచించారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.
READ MORE: Kethika Sharma : నడుము అందాలతో కేక పుట్టిస్తున్న కేతిక..