NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో హెలికాప్టర్ల చక్కర్లు

Tirumala

Tirumala

Tirumala: తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్‌లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు కూడా ఎయిర్‌ఫోర్స్‌ విభాగానికి చెందినవిగా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్‌ విభాగానికి చెందినవిగా గుర్తించారు అధికారులు.. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో ఆ మూడు హెలికాప్టర్లు తిరుమల మీదుగా ప్రయాణించినట్లు తెలుస్తోంది.

Read Also: Tollywood: ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!

కాగా, తిరుమల శ్రీవారి ఆలయంపై గతంలో విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించిన విషయం విదితమే.. విమానం ఆలయం మీదుగా వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీసేందుకు.. చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ విమానం సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిందిగా గుర్తించారు. భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికే విమానం వచ్చిందని.. సంబంధిత సిబ్బంది చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్న విషయం విదితమే.. అయితే, శ్రీవారి ఆలయం పరిసరాల్లో విమానాలు తిరగడకూడదనే నిబంధన ఉండి కూడా.. ఇలా విమానాలు.. ఇప్పుడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.