ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.