America : శరణార్థుల ప్రవేశంపై అమెరికాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెనిజులా, నికరాగ్వా, క్యూబా, హోండురాస్‌తో సహా అనేక దేశాల నుండి శరణార్థులు మెక్సికోకు చేరుకున్నారు. మెల్లగా ఈ వ్యక్తులు అమెరికా సరిహద్దు వైపు కదులుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలున్నారు. ఈ జన సమూహం క్రిస్మస్ పండుగ సందర్భంగా టపాచులా (మెక్సికో) చేరుకున్నారు. 6000 మందికి పైగా శరణార్థులు అమెరికా సరిహద్దుల వైపు కదులుతున్నారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద గ్రూప్ అని చెబుతున్నారు. మార్చిలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున జనం అమెరికా వైపు వెళ్లారు.
Read Also:Sriya Reddy: ఎంత చెప్పినా ప్రశాంత్ నీల్ వినలేదు.. సలార్ రాధారమ పాత్రపై శ్రీయరెడ్డి షాకింగ్ కామెంట్స్
రెండేళ్లలో 20 లక్షల మంది అరెస్ట్
సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించిన 20 లక్షల మందిని అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంఖ్య గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినది. ఈ ఏడాది డిసెంబర్‌లో అమెరికా 10 వేల మందికి పైగా వలసదారులను అరెస్టు చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని నిర్వాసితులంటున్నారు. మరికొద్ది నెలల్లో అమెరికా వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
Read Also:Praja Bhavan: ప్రజా భవన్ వద్ద రాష్ డ్రైవింగ్ కేసు.. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు..!
మెక్సికోలో 6.80 లక్షల మంది అక్రమ వలసదారులు
మెక్సికోలో 6.80 లక్షల మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో 1.37 మందికి పైగా వలసదారులు ఆశ్రయం పొందుతున్నారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు తెలిపారు. క్యూబా, వెనిజులాపై ఆంక్షలను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ కోరారు.