Praja Bhavan: ప్రజా భవన్ వద్ద జరిగిన రాష్ డ్రైవింగ్ కేస్ లో నిందుతులని గుర్తించామని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ అన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ గా గుర్తించామన్నారు. ప్రస్తుతం రాహెల్ పరారీ లో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాహెల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని అన్నారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి బిఎమ్ డబ్ల్యూ కార్ ఢీ కొట్టిందని తెలిపారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని అన్నారు. ఈ విధంగా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న వారు డ్రంకన్ కండిషన్ లో లేరన్నారు. గతంలో జూబ్లీహిల్స్ లో కూడా ప్రమాదం చేసినట్లుగా గుర్తించామన్నారు. ఆ కేసులో కూడా దర్యాప్తు చేసి పూర్వపరాలను గమనిస్తామన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు.
Read also: Bihar : స్కూల్ను బార్గా మార్చారు.. ఆఫీసర్లొచ్చే సరికి.. మందు, ముక్కతో రెడీగా హెచ్ఎం, టీచర్లు
బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున 3 గంటల సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు (టీఎస్ 13 ఈటీ 0777) ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ యువతీయువకులకు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించేందుకు హోంగార్డును ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పంపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్ (27)పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Kalyan Ram: రెండు పడవల మీద కాళ్ళు వద్దనుకున్నా.. అందుకే వదిలేశా!