డాక్టర్ వెంకట్ తోట 2005లో హిమాయత్ నగర్ లో రెవెరా ఏస్థటిక్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ ను ప్రారంభించారు. అప్పటికే పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గా ఉన్న డాక్టర్ వెంకట్ తోట ప్రతిభ కారణంగా రెవెరా బెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ గా పేరు తెచ్చుకుంది. దాంతో ఆయన కొండాపూర్ లో రెవెరా ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అది కార్యరూపం దాల్చకముందే తోట వెంకట్ గత యేడాది సెప్టెంబర్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఆకాంక్షను వారి శ్రీమతి డాక్టర్ రాధ తోట, తనయుడు డాక్టర్ అఖిలేష్, కుమార్తె డాక్టర్ నిహారిక పరిపూర్ణం చేశారు.
Read Also: Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్
సకల సౌకర్యాలను సమకూర్చుకున్న రెవెరా ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్ కేర్ సెంటర్ కొండాపూర్ బ్రాంచ్ ను ఆదివారం ఉదయం హీరో సుశాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుశాంత్ తల్లి నాగసుశీల, సోదరీమణులు కూడా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా స్వర్గీయ డాక్టర్ వెంకట్ తోట గారితోనూ, వారి కుటుంబ సభ్యులతోనూ తమకున్న అనుబంధాన్ని సుశాంత్ తలుచుకున్నారు.
హిమాయత్ నగర్ క్లినిక్ లో మాదిరిగానే కొండాపూర్ బ్రాంచ్ సైతం విశేష ఆదరణ పొందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ లో ఎక్స్ క్లూజివ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ను ప్రారంభించిన అతి కొద్దిమందిలో తన తండ్రి వెంకట్ తోట ఒకరని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కొండాపూర్ లోనూ తమ క్లినిక్ ను ప్రారంభించామని డా. అఖిలేష్ తోట తెలిపారు. బిజీ షెడ్యూల్ లోనూ సుశాంత్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఆనందాన్ని కలిగించిందని డా. రాధ తోట అన్నారు. రెవెరా కొండాపూర్ బ్రాంచ్ లో ప్లాస్టిక్ సర్జన్స్ రాజేశ్ వాసు, శివరాం మల్లెల, బి.ఆర్.ఎన్. పద్మిని, అంకిత హరిజీ సేవలు అందించబోతున్నారు. డైరెక్టర్ కమ్ మెడికల్ కాస్మొటాలజిస్ట్ రాధ తోట, జనరల్ సర్జన్ అఖిలేష్ తోట ఈ క్లినిక్ ను నిర్వహించబోతున్నారు.
Read Also:Vani Jayaram: ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!