NTV Telugu Site icon

Mahesh Babu: మహేశ్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా?

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ ఇండస్ట్రీలో నెం.1రేసులో ముందుంటారు మహేశ్. ఇది ఇలా ఉంటే దివంగత సీనియర్ హీరోయిన్ సౌందర్య కాంబినేషన్లో మహేశ్ ఓ మూవీలో నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ కాంబో సెట్ కాలేదు. ఇప్పటికీ ఆ సినిమా ఓ క్లాసికల్ గా నిలిచిపోయింది.

Read Also:Anupama Parameswaran: అందాలు ఆరబోస్తున్న “అనుపమ”..

ఒక సూపర్ హిట్ సినిమా గురించి చాలామందికి తెలియదు. రెండున్నర దశాబ్దాల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలీ, ఇంద్రజ హీరో, హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ యముడు పాత్ర పోషించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక అలీకి హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. ఇంద్రజకు కూడా హీరోయిన్ గా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటించే ఛాన్స్ వచ్చింది. ఎస్వీ. కృష్ణారెడ్డి కెరీర్ లో ఇది మెమొరబుల్ సినిమాగా నిలిచిపోనుంది. ఎస్వీ కృష్ణారెడ్డి మహేష్ బాబు, సౌందర్య లను దృష్టిలో ఉంచుకుని రచించారట. ఈ సినిమా సమయానికి మహేష్ బాబు వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే..! అప్పటికి సౌందర్య వయసు 22 ఏళ్లు. మహేష్ బాబు కన్నా సౌందర్య మూడు సంవత్సరాలు పెద్దది. అయితే సూపర్ స్టార్ కృష్ణకు యమలీల సినిమా కథ వినిపించగా కృష్ణ మహేశ్ ఏజ్ చిన్నది ఇలాంటి పెద్ద కథను హ్యాండిల్ చేయలేకపోవచ్చు.. వేరే వాళ్లతో తీయమని సలహా ఇచ్చారట. ఇలా మహేశ్ యమలీల సినిమాను చేయాల్సి తన చేతి నుంచి జారిపోయింది.

Read Also:Banita Sandhu – AP Dhillon: ఛీ..ఛీ.. బాత్రూమ్‌లో ఆ పని చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ కపుల్