ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా 2021లో విడుదల అయి పాన్ ఇండియా రేంజ్‍లో సంచలన విజయం సాధించింది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో పాపులర్ అయ్యారు.అలాగే ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప చిత్రానికి సీక్వెల్‍గా పుష్ప ది రూల్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ మూవీ గురించి న్యూ అప్‍డేట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో హీరో అల్లు అర్జున్ ఏ కార్యక్రమానికి హజరైనా పుష్ప 2 సినిమా గురించే ఆయనకు వరుసగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి.. పికాబు పేరుతో ఓ ప్రీమియమ్ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. ఈ పికాబు సంస్థ శనివారం హైదరాబాద్‍లో పికాబు ప్రెజెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ నిర్వహించింది. తన భార్యకు సపోర్టుగా ఈ కార్నివాల్‍కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే, పుష్ప 2 సినిమా గురించి అప్‍డేట్ ఇవ్వాలని అక్కడి వారు అడిగారు.తన భార్యకు సపోర్ట్ ఇచ్చేందుకే తాను ఈవెంట్‍కు వచ్చానని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప 2 షూటింగ్ నుంచే ఇక్కడికి వచ్చానని చెప్పారు. దీంతో అప్‍డేట్ ఇవ్వాలని అక్కడి వారు అడిగారు. పుష్ప 2 గురించి అప్‍డేట్ ఇవ్వాలని అడగగానే.. గట్టిగా నవ్వుతూ చెప్పను అనేలా చేయి ఊపారు అల్లు అర్జున్. “ఇది సరైన ఈవెంట్ కాదు. తర్వాత.. తర్వాత” అని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప 2 అప్‍డేట్ అనగానే ఐకాన్ స్టార్ గట్టిగా నవ్వుతూ స్పందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Annaya speech ❤️🔥@alluarjun 🦁 @AlluSnehaReddy_#AlluArjun #Pushpa2TheRule #AlluArjun𓃵 #PushpaTheRule pic.twitter.com/9Y4xwIjiYN
— Tej (@DEMI_GOD__BUNNY) January 20, 2024