NTV Telugu Site icon

Kerala: టేకాఫ్‌కి ముందు విమానంలో పొగలు.. ఫ్లైట్ లో142 మంది ప్రయాణికులు..

Kerala

Kerala

శుక్రవారం ఉదయం తిరువనంతపురం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగ వ్యాపించాయి. విమానంలో అలారం మోగింది. దీంతో టేకాఫ్‌కు ముందే విమానాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చారు. ఈ విమానం తిరువనంతపురం నుంచి మస్కట్‌కు 142 మంది ప్రయాణికులతో బయలుదేరాల్సి ఉంది. న్యూస్ ఏజెన్సీ ప్రకారం… ఈ సంఘటన ఈ రోజు ఉదయం 10:30 గంటలకు జరిగింది. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా స్మోక్ అలారం (ఫ్లైట్ స్మోక్ అలారం) మోగింది. విమానంలో పొగలు కమ్ముకున్నాయి. టేకాఫ్ కి ముందే ఘటన జరగడంతో ప్రయాణికులు తప్పించుకుని.. ఊపిరి పీల్చుకున్నారు.

READ MORE: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?

ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ వర్గాల ప్రకారం.. అనుమానాస్పదంగా అనిపించగానే.. భద్రతను దృష్టిలో ఉంచుకుని, టేకాఫ్‌కు ముందు వెంటనే విమానాన్ని ఆపాలని నిర్ణయించారు. పైలట్ తెలివి ప్రదర్శించి టేకాఫ్‌కు ముందే విమానాన్ని నిలిపివేసి తిరిగి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. దీని తరువాత, ప్రయాణీకులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది. తద్వారా వారి ప్రయాణాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముగించవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

READ MORE:Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ వచ్చేస్తోంది!

ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరుపుతామని, పొగలు రావడానికి కారణమేమిటో తేలుతుందని ఆయన అన్నారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యంపై ఎయిర్‌లైన్ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను త్వరలో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచారు.