Site icon NTV Telugu

Theft: పెండ్లి బృందానికి బాలుడి ఝలక్.. లక్ష ఎలా కొట్టేశాడో చూడండి..

Theft

Theft

Theft:నాగర్‌కర్నూల్ జిల్లాలో పెళ్లి బృందానికి బాలుడు షాక్ ఇచ్చాడు. పెళ్లి బృందం నుంటి లక్ష రూపాయలు కొట్టేశాడు 13 ఏళ్ల బాలుడు. ఈ ఘటన ఈ నెల 22న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనచింతలపల్లికి చెందిన వరుడి బంధువులు, గట్టురాయపాకకు చెందిన వధువు బంధువులు కలిసి పెళ్లి బట్టలు తీసుకునేందుకు షాప్‌కు వచ్చారు. బంధువులంతా పెళ్లి దుస్తులపై దృష్టి పెడితే.. 13 ఏళ్ల బాలుడు మాత్రం వారు తీసుకొచ్చిన నగదుపై కన్నేశాడు. సుమారు అరగంటపాటు నగదు ఉన్న వ్యక్తి దగ్గర రెక్కీ నిర్వహించి లక్ష రూపాయలను దోచేశాడు.

Read Also: Land Dispute: భూవివాదం.. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాల దాడి

తీరా దుస్తులు తీసుకున్న తర్వాత డబ్బుల కోసం వెతకగా అవి మాయమైనట్లుగా గుర్తించారు. వెంటనే సీసీటీవీ పరిశీలించగా ఈ విషయం బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Exit mobile version