NTV Telugu Site icon

IPL 2025 Mega Auction: ఈ బౌలర్లకు మెగా వేలంలో జాక్ పాట్.. భువీకి ఏకంగా..!

Buvi

Buvi

ఐపీఎల్‌ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. కాగా.. రెండో రోజు వేలం ప్రారంభమైంది. అందులో భాగంగా.. మెగా వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. ముఖ్యంగా.. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువీపై ఎక్కువగా బిడ్ చేసింది. చాలా సీజన్లలో హైదరాబాద్‌కు ఆడిన భువనేశ్వర్‌ను ఆర్టీఎం ద్వారా తీసుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో.. ఈ సీజన్‌లో భువీ బెంగళూరుకు ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. భువనేశ్వర్ కుమార్ జాక్ పాట్ కొట్టాడు. గతంలో 4.2 కోట్లకు సన్ రైజర్స్ తీసుకోగా.. ఆర్సీబీ ఈసారి రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

Read Also: Iran: నెతన్యాహును చంపేయండి.. ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

అలాగే.. గత సీజన్‌లో సీఎస్కేకు ఆడిన తుషార్ దేశ్ పాండే ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడనున్నాడు. తుషార్ దేశ్ పాండేను రూ. 6.50 కోట్లకు ఆర్ఆర్ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ రూ. కోటి.. కాగా, అతని కోసం సీఎస్కే, రాజస్థాన్ పోటీ పడ్డాయి. మరోవైపు.. ఆర్టీఎం ద్వారా ముఖేష్ కుమార్ రూ.8 కోట్ల ధర పలికాడు. పేసర్ ముఖేష్ కుమార్ కోసం సీఎస్కే, పంజాబ్, ఢిల్లీ మధ్య వేలం జరిగింది. అలాగే.. దీపక్ చాహర్‌ను ముంబై భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 9.25 కోట్లకు సొంతం చేసుకుంది. చాహర్ కోసం చెన్నై, ముంబై మధ్య పోటీ సాగింది. యువ బౌలర్ ఆకాశ్ దీప్‌ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.కోటి. అతని కోసం లక్నో, పంజాబ్ పోటీ పడ్డాయి. ఆర్టీఎం ద్వారా అతనిని తీసుకునేందుకు ఆర్సీబీ ఆసక్తి చూపలేదు.

Read Also: Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్