NTV Telugu Site icon

World Cup 2023: టీమిండియాలో ఇప్పటివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది వీరినే..

Player Of The Match

Player Of The Match

ఐసీసీ ప్రపంచ కప్ 2023.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందారు. రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచకప్ లో ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు టీమిండియా తరుఫున క్రికెటర్లలో ఎవరెవరిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వరించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Husband Kills Wife: భార్యను టూర్‌కి తీసుకెళ్లి స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు..

కేఎల్ రాహుల్..
ఈ టోర్నీలో టీమిండియా మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 97 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. దీంతో రాహుల్ ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది.

రోహిత్ శర్మ..
ఈ టోర్నీలో టీమిండియా రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్తాతో తలపడింది. ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 131 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రోహిత్ ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది.

జస్ప్రీత్ బుమ్రా..
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో బుమ్రా.. 7 ఓవర్లు వేసి 2 కీలక వికెట్లు తీశాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది.

విరాట్ కోహ్లీ
టోర్నీ నాల్గవ మ్యాచ్ లో.. బంగ్లాదేశ్ తో టీమిండియా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. 103 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడటంతో కోహ్లీని ఈ అవార్డు వరించింది.

మహమ్మద్ షమీ
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ తో మహమ్మద్ షమీ.. ఈ టోర్నీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇవ్వడం మాములుగా లేదు. ఏకంగా 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 ఓవర్లలో 5 కీలక వికెట్లు తీశాడు. అంతేకాకుండా.. ఒక ఓవర్ మెయిడిన్ కూడా చేశాడు. దీంతో షమీకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

రోహిత్ శర్మ
ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 101 బంతుల్లో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో రోహిత్ కు రెండో అవార్డు.

మహమ్మద్ షమీ
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో షమీ మళ్లీ చెలరేగాడు. 5 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉంది. దీంతో షమీకి రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి శతకం సాధించాడు. 121 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోహ్లీకి ఈ మ్యాచ్ లో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

శ్రేయాస్ అయ్యర్
లీగ్ చివరి మ్యాచ్ టీమిండియా-నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ శతకం బాదాడు. కేవలం 94 బంతుల్లోనే 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో అయ్యర్ ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

మహమ్మద్ షమీ
తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా-న్యూజిలాండ్ తలపడింది. ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమీ రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే ఎవరూ సాధించలేని అరుదైన ఘనతను షమీ సాధించాడు. కివీస్ బౌలర్లను కట్టడి చేయడంతో పాటు.. కీలకమైన 7 వికెట్లను తీశాడు. 9 5 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు సాధించాడు. దీంతో ఈ టోర్నీలోనే షమీని మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది.

Show comments