NTV Telugu Site icon

IND vs SL: భారత్-శ్రీలంక వన్డే చరిత్రలో రికార్డ్స్ ఇవే..!

Ind Vs Sl Records

Ind Vs Sl Records

2023 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ​​168వ మ్యాచ్‌. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 98 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, 11 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇక.. వికెట్ల పరంగా ముత్తయ్య మురళీధరన్ నంబర్-1 స్థానంలో ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా వీరిద్దరి రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. భారత్-శ్రీలంక వన్డే చరిత్రకు సంబంధించిన టాప్ 10 గణాంకాలను తెలుసుకుందాం.

IND vs SL: తొలి ఓవర్లనే రోహిత్ శర్మ ఔట్.. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు

అత్యధిక స్కోరు:
ఈ రికార్డు భారత్ పేరిట ఉంది. 2009 డిసెంబర్ 15న రాజ్‌కోట్ వన్డేలో శ్రీలంకపై భారత్ 7 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది.

అత్యల్ప స్కోరు:
ఈ చెత్త రికార్డు శ్రీలంక ఖాతాలో చేరింది. 2000 అక్టోబర్ 29 న షార్జా వన్డేలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది.

అతిపెద్ద విజయం:
ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తిరువనంతపురం వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

అతి చిన్న విజయం:
1993 జూలై 25న కొలంబోలో జరిగిన వన్డేలో భారత్ 1 పరుగు తేడాతో శ్రీలంకను ఓడించింది.

అత్యధిక పరుగులు:
శ్రీలంకపై భారత లెజండరీ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ ఖాతాలో 3113 పరుగులు ఉన్నాయి.

అత్యుత్తమ ఇన్నింగ్స్:
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014 నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై హిట్‌మాన్ 264 పరుగులు చేశాడు.

అత్యధిక సెంచరీలు:
ఈ విషయంలో విరాట్ కోహ్లీ నంబర్-1 స్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై విరాట్ 10 సెంచరీలు చేశాడు.

అత్యధిక వికెట్లు:
శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ భారత్‌పై 74 వికెట్లు పడగొట్టాడు.

అత్యుత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్:
ఇక్కడ కూడా మురళీధరన్ ముందంజలో ఉన్నాడు. మురళీధరన్ 2000 అక్టోబర్ 27న షార్జా వన్డేలో 30 పరుగులకు 7 వికెట్లు తీశాడు.

కీపర్ క్యాచ్, స్టంపింగ్‌లు:
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని శ్రీలంకపై 96 ఔట్‌లు చేశాడు. వీటిలో 71 క్యాచ్‌లు, 25 స్టంపింగ్‌లు ఉన్నాయి.

Show comments