Modi Swearing Ceremony: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు వీళ్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుక రేపు (జూన్ 9) రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరగబోతుంది. ప్రధానితో పాటే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ అతిథులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు దేశాలకు ఆహ్వానాలను పంపింది. ఆహ్వానాలను అందుకున్న విదేశీ అథితులు వారి రాకను ధృవీకరించారు. ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథుల కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ లాంటి ప్రధాన హోటళ్ల దగ్గర ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: NEET Results: నీట్ ఫలితాలపై దుమారం..విచారణ కోరుతున్న ప్రియాంక గాంధీ
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
ఇక, బంగ్లాదేశ్ ప్రధాని, సీషెల్స్ అధ్యక్షుడు ఈరోజు న్యూఢిల్లీకి వస్తుండగా, మిగతా నేతలందరూ ఆదివారం రాబోతున్నారు. నేపాల్ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి నాలుగు గంటల ముందుగా రానున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక దగ్గరకు రావడానికి నిర్దేశిత మార్గాలను సైతం ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడంతో పాటు రేపు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
Read Also: బాగా బరువు పెరిగారా? అయితే ఇలా చేయండి..
అయితే, ఈ వేడుకకు రాబోతున్న అతిధులు ఎవరెవరంటే..
శ్రీలంక అధ్యక్షుడు- రణిల్ విక్రమసింఘే
మాల్దీవుల అధ్యక్షుడు- మహ్మద్ ముయిజ్జూ
సీషెల్స్ ఉపాధ్యక్షుడు- అహ్మద్ అఫీఫ్
బంగ్లాదేశ్ ప్రధాని-షేక్ హసీనా
మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్
నేపాల్ ప్రధాన మంత్రి- పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’
భూటాన్ ప్రధాని-షెరింగ్ టోబ్గే ఉన్నారు.
తాజావార్తలు
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..