Site icon NTV Telugu

Jupally Krishna Rao: లిక్కర్ బ్రాండ్ల మీద నిషేధం లేదు.. ఆబ్కారీ మంత్రి స్పష్టం

Jupally Krishna Rao

Jupally Krishna Rao

లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. “మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్. గత ప్రభుత్వం 2300 కోట్లు బిల్లులు డ్యూ పెట్టింది. మేము వచ్చాకా కొన్ని తీర్చినం చేశాం. మీరు బకాయిలు పెట్టి మమ్మల్ని నిందిస్తున్నారు. చెల్లింపులు చేయకపోతే మీకేం నష్టం.. ప్రజలకు నష్టం లేదు. బ్రాండ్ల మీద నిషేధం లేదు. గతంలో ముడుపులు చెల్లిస్తే పోస్టులు ఇచ్చే వాళ్ళు మీరు. ఇప్పుడు పైరవీలు లేకుండా పోస్టింగులు ఇస్తున్నాం. వచ్చి మూడు నెలలు కాలేదు ఐదు వేల కోట్ల ముడుపులు వస్తాయా..?. జూపల్లి శాఖలో అవినీతి ఉంటదా? కేబినెట్ నిర్ణయం లేకుండా పాలసీ వస్తుందా..? పే మెంట్ల పెండింగ్ వాస్తవం. పెండింగ్ కి కారణం మీరే కదా” అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి బట్టి పేమెంట్స్ ఉంటాయని.. కొత్త బ్రాండ్లుకు దరఖాస్తు లే రాలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

READ MORE: Boora Narsaiah Goud: నీకు ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది.. రేవంత్ రెడ్డిపై బూర నర్సయ్య ఫైర్

కాగా.. రాష్ట్రంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా అధికార పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రూ. 500 బోనస్ తదితర పథకాల అమలు ఏమైందని అడుగుతున్నారు.

Exit mobile version