Site icon NTV Telugu

Varla Ramaiah: రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉంది.. ఈసీకి వర్ల రామయ్య లేఖ

New Project (31)

New Project (31)

మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలతో రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ పేర్ని నాని విమర్శలు చేస్తున్నాడని.. అధికారులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించకపోతే రేపటి నుంచి వారికి సంగీతమే అంటూ ఇన్ డైరెక్ట్‌గా బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మే 29, 2024 న చేసిన వ్యాఖ్యల మాదిరే పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని..సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని రాసుకొచ్చారు.

READ MORE: UP: కూలీ నోట్లో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. వీడియో వైరల్

సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని బెదిరింపులకు బయపడి రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు సెలవులకు ధరఖాస్తు చేశారని ఆరోపించారు. సజ్జల, పేర్ని నానిల వ్యాఖ్యలు శాంతియుత, నిష్ఫాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. వైకాపా నాయకులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు భాష పట్ల జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోగలరని కోరారు. సజ్జల, పేర్ని నానిలపై నమోదైన కేసులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించంలని విజ్ఞప్తి చేశారు. వైకాపా నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కౌటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరగకుండా మరింత భద్రతా ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.

కాగా.. రేపు (జూన్ 4న) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికికే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. గంతో గొడవలు జరిగిన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Exit mobile version