కూటికి గతిలేకున్నా పర్లేదు కానీ, కులం కోసం కుమ్ములాటలకు దిగుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం కోసమే జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. కులమతాలే అర్హత అన్నట్లుగా గొప్పలకు పోతున్నారు. విచక్షణ మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఐక్యతతోనే బలం అన్నది మరిచి కులం ముసుగులో విడిపోయి బలహీనమవుతున్నాము అన్న సంగతి మరిచిపోతున్నారు. మానవులంతా ఒక్కటే అన్న నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే విషయం తెలిస్తే కుల రక్కసి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే కాలనీ వాసులు ఐక్యంగా ఉండాల్సిందిపోయి కులానికో బోర్డు పెట్టుకుని తమ కులపిచ్చిని చాటుకున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read:Keerthy Suresh: ఆ రోల్స్ కోసమే బాలీవుడ్‌కి వచ్చాను..
ఒక కాలనీకి ఒక పేరు ఉండడం మీరు చూసే ఉంటారు. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాత్రం ఒకే కాలనీలో ఆరు పేర్లు అది కూడా కులాల పేర్లతో కనిపించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ మినీ కాలనీలో కులాల పేర్లతో బోర్డులు ఏర్పాటయ్యాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ముట్రాజ్‌పల్లి రోడ్డు పక్కన ఇటీవలే వినాయకనగర్‌గా ఓ కొత్త కాలనీ ఏర్పడింది. అప్పటివరకు కుల భేదాలు లేకుండా అందరూ దీనిని వినాయకనగర్‌గానే పిలిచేవారు అందరు కలసికట్టుగానే ఉండేవారు.
Also Read:Indian RAilways: చైనా సరిహద్దులో భారత రైల్వే ప్రాజెక్ట్.. ఖర్చు ఎంతో తెలుసా… ?
అయితే చూస్తుండగానే పరిస్థితి ఊహించలేనంతగా మారిపోయింది. కాలనీకి వెళ్లే రోడ్డుపక్కన ఒక్కసారిగా ఐదు కొత్త బోర్డులు వెలిశాయి. వాటిపై వరుసగా రెడ్డి ఎన్క్లేవ్, ఆర్యవైశ్య ఎన్క్లేవ్, ముదిరాజ్ ఎన్క్లేవ్, విశ్వకర్మ ఎన్క్లేవ్, యాదవ్ ఎన్క్లేవ్ అంటూ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇది తెలిసిన వారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాలనీ వాసులు కలిసిమెలిసి ఉండాల్సిందిపోయి కులలాపేరుతో విడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాగరిక సమాజంలో ఇంకా ఎంతకాలం ఇలా కులాలతో జీవిస్తారంటూ మండిపడుతున్నారు.