పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.ఈ వార్తలపై సినిమా యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సలార్‌లో యశ్ నటిస్తోన్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ సలార్ సినిమాలో ప్రభాస్ మరియు పృథ్వీరాజ్‌తో పాటు యశ్ కూడా నటిస్తున్నట్లు చెప్పింది. అనుకోకుండా ఆమె యశ్ పేరును కూడా చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సలార్‌లో యశ్ ఉన్నాడని క్లారిటీ రావడంతో అతడి అభిమానులు ఎంతో ఖుషీ అయ్యారు.అయితే సినిమాలోని ట్విస్ట్‌ను రివీల్ చేయడంపై తీర్థ సుభాష్‌ను కొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. దాంతో సలార్‌లో యశ్ ఉన్నాడని చేసిన కామెంట్స్‌పై తీర్థ సుభాష్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది..
కెజిఎఫ్ సినిమాను తాను చాలా సార్లు చూశానని, అందులో యశ్ నటన ఎంతగానో నచ్చిందని చెప్పింది. కేజీఎఫ్ మూవీతో పాటు ఆ సినిమా మ్యూజిక్, హీరో యశ్ గురించి మా నాన్న చాలా సార్లు చెప్పారని, ఆయన మాటలను బట్టి యశ్ కూడా సలార్‌లో ఉంటాడని అనుకొని పొరపాటుగా అతడి పేరు చెప్పానని ఆమె తెలిపింది.అలాగే సలార్‌లో యశ్ రోల్ గురించి చేసిన కామెంట్స్‌పై తనను ట్రోల్ చేయద్దని కోరింది. ప్రస్తుతం తీర్థ సుభాష్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. మాలికాపురం సినిమాతో తీర్థ సుభాష్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఇదిలా ఉంటే సలార్ మూవీ, కెజిఎఫ్ మూవీ రెండు వేరు వేరు అని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదివరకే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సలార్ మూవీని ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే కథతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, శృతిహాసన్ మరియు బాబీ సింహా ముఖ్య పాత్రలు చేస్తున్నారు.