Site icon NTV Telugu

Heart Attack: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి.. నిజామాబాద్లో ఘటన

Cricket

Cricket

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మరీ పెద్ద వయస్సు వాళ్లు ఈ ప్రమాదంలో చనిపోతున్నారా అంటే అది కాదు.. చిన్న పిల్లలు నుంచి మొదలుపెడితే, యువకుల్లోనే గుండెపోటు ప్రమాదాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు.

Read Also: Andhara Pradesh: ఏపీ శాసనసభ రద్దు..

వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లిన యువకుడు శవంగా తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు. దీంతో.. తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు.

Read Also: PM Modi: “గెలుపోటములు రాజకీయాల్లో భాగమే, అంకెల ఆట కొనసాగుతుంది”..

Exit mobile version