NTV Telugu Site icon

WHO: వండిన వెంటనే ఆహారం తినడం లేదా.. ప్రమాదంలో పడ్డట్టే

Food

Food

వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Public Toilet: ఇదేంటి భయ్యా.. పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్స్.. అసలేమీ జరుగుతుంది..

డబ్ల్యూహెచ్ఓ (WHO) నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. దీని వల్ల దాదాపు 4 లక్షల 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతూ తమ జీవితాలను చాలా సంవత్సరాలు వృధా చేసుకుంటారు. తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా ఇటువంటి పరిస్థితులకు ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఒక సూచన చేసింది. ఆహారాన్ని తయారు చేయడం, తినడం గురించి కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా ఆహారం వల్ల కలిగే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ మార్గదర్శకాలలో మొదటి ఏమిటంటే.. వంట చేసిన వెంటనే ఆహారం తినాలి.

CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. వంట చేసిన వెంటనే ఆహారం తినాలి.. ఆలస్యం చేయకూడదు. వంట వండే సమయంలో ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా దాదాపు నాశనం అవుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు వండిన ఆహారాన్ని 5 ° C నుండి 60 ° C వరకు చల్లబరచినట్లయితే, బ్యాక్టీరియా మళ్లీ దానిలో వృద్ధి చెందుతుంది. దీంతో ఆహారం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పింది. అంతేకాకుండా.. ఆలస్యంగా తినడం వల్ల ఆహారంలో ఉండే ఆరోగ్య విలువలు తగ్గుతాయి. అంతేకాకుండా.. రుచి కూడా తగ్గుతుంది.