Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం
- హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
- నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
- గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది.
Also Read
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. ఎగువ వాయుగుండం కొనసాగుతుంది. ఈ ప్రభావం కారణంగా తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Read Also: Stock market: రికార్డులు సృష్టించి.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!