NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం

Rain

Rain

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది.

Read Also: Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. ఎగువ వాయుగుండం కొనసాగుతుంది. ఈ ప్రభావం కారణంగా తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది.

Read Also: Stock market: రికార్డులు సృష్టించి.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్