Site icon NTV Telugu

UP: అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే చితక్కొట్టారు కదా.. చెట్టుకు కట్టేసి మరీ..!

Up Lovers

Up Lovers

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది. కాగా.. అర్ధరాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Kolkata doctor case: సీబీఐ కీలక నిర్ణయం.. సందీష్ ఘోష్ సహా నలుగురు డాక్టర్లకు లై డిటెక్టర్ పరీక్ష

ఈ ఘటనపై చౌబియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బెచన్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుధీర్ యాదవ్ అనే యువకుడు రాత్రి 11 గంటల ప్రాంతంలో తన ప్రియురాలిని కలిసేందుకు రాంపుర గ్రామం మీదుగా వెళ్తున్నాడన్నాడు. ఇంతలో యువకుడు గ్రామస్తులను చూసి దాక్కోవడంతో దొంగగా భావించారని.. దీంతో గ్రామస్తులు యువకుడిని పట్టుకుని కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం చెట్టుకు కట్టేశారని తెలిపాడు. యువకుడు కొట్టొద్దని ఎంత చెప్పినా గ్రామస్తులు మాట వినలేదని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి చెప్పాడు.

Read Also: Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా.. కఠిన చర్యలకు ఆదేశాలు

ఈ క్రమంలో.. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చౌబియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బెచన్ సింగ్ మాట్లాడుతూ.. యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, గ్రామస్తులు యువకుడిని దొంగ అని చెప్పారన్నాడు. ఈ క్రమంలో యువకుడిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నట్లు యువకుడు చెప్పాడు. కానీ గ్రామస్తులు అతన్ని దొంగగా భావించారన్నాడు. ఈ క్రమంలో.. గ్రామస్తులపై, యువకుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Exit mobile version