Scorpion Venom: చాలా మంది విష జంతువుల దగ్గరికి వెళ్లాలంటే భయపడతారు. ఆ క్రమంలో ముందుగా పాములు, బల్లులు, తేళ్లు ఉంటాయి. వీటిని చూడగానే జనం అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే కోట్లు కుమ్మరించే విషం ఒకటి ఉందని మీకు తెలుసా, అవును మీరు విన్నది నిజమే. తేలు విషం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. సాధారణంగా తేలు కుట్టడం, పాము కాటు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాటికి గుచ్చుకుంటే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇక పాము, తేళ్ల విషం మనిషి శరీరంలోకి చేరితే మనిషి బతకడం చాలా కష్టం. అయితే వాటి విషం నుంచి మనుషులకు ఉపయోగపడే మందులు తేలు విషం కోట్లలోనే పలుకుతుందట. లీటరు తేలు విషం 80 కోట్ల రూపాయలు పలుకుతుందట.
Read Also:Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..
సాధారణంగా అందరూ కోళ్లు, పందులు, మేకలు.. ఇలా పెంచుతుంటారు.. అయితే తేలు విషం ఖరీదు గురించి తెలుసుకుని టర్కీకి చెందిన మెటిన్ ఓరిన్లర్ అనే వ్యక్తి తేళ్ల కోసం ఫామ్ హౌస్ ఏర్పాటు చేసి.. అందులో వాటిని పెంచుతున్నాడు. వేల సంఖ్యలో తేళ్లను పెంచి వాటి విషాన్ని సేకరిస్తున్నాడు. విషాన్ని స్తంభింపజేసి పౌడర్‌గా మార్చి విక్రయిస్తున్నాడు. సేకరించిన తేలు విషాన్ని యాంటీబయాటిక్స్, సౌందర్య సాధనాలు మరియు పెయిన్ కిల్లర్స్ తయారీలో ఉపయోగిస్తారు. కానీ 300 నుండి 400 తేళ్ల నుండి ఒక గ్రాము విషాన్ని మాత్రమే సేకరించవచ్చు.
Read Also:Murder Attempt: దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు.. చివరికి.?