NTV Telugu Site icon

Viral Video: పామును తిన్న తాబేలు.. నమ్మలేకపోతున్నారా ఈ వీడియో చూడండి..!

Tortaoise

Tortaoise

Viral Video: తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూసారా?. మాములగా ఐతే పాములు కప్పలు, పురుగులను తింటుంది. తాబేలు మాత్రం మట్టి, గడ్డి లాంటివి తింటూంటాయి. అయితే ఈ వీడియోలో తాబేలు పామును తింటుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తాబేలు శాకాహార జీవి అని అందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ వీడియోను చూస్తే.. తాబేలు శాఖాహారా, మాంసాహారా అని తెలుస్తుంది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేశారంటే.. కంచం ఖాళీ చేస్తారు..

ప్రవహించే నీటిలో ఒక బండ కింద తాబేలు దాక్కున్నట్లు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఆ సమయంలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఇంతలో ప్రవహిస్తున్న నీటిలోంచి బండ దగ్గరికి ఓ పాము వస్తుంది. వెంటనే తాబేలు రాయిలో నుండి బయటికి వచ్చి రెప్పపాటులో నోటిలో పామును పట్టుకుంటుంది.

MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం

తాబేలు షాకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @unilad అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఓ వినియోగదారుడు ఆశ్చర్యపోయి క్యాప్షన్‌లో రాశారు. తాబేలు కూడా పామును తినగలదని నాకు తెలియదు. ఈ వీడియోను ఇప్పటి వరకు 77 వేల మందికి పైగా లైక్ చేశారు. అయితే ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై కొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాబేలు పిజ్జాను ఇష్టపడుతుందని అనుకుంటా.. అని ఒకరంటుంటే.. మరికొందరు కొన్ని తాబేళ్లు చాలా తెలివైనవి. అందులో ఇది ఒకటి అంటున్నారు. మరొకరు తాబేలు పాముపై దాడి చేసిన వేగంపై ఆశ్చర్యపోయానని తెలిపారు.