ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీజగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తరువాత ఆ రేంజ్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు.రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ మూవీ స్కంద.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించారు.అఖండ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ తో చేసిన స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ తో, ఫ్యామిలీ ఎమోషన్స్ స తో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది . ఇక రీసెంట్ గా స్కంద మూవీ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ లాంచ్ చేసారు..ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ట్రైలర్ లో కనిపించాయి.అయితే ఈ ట్రైలర్ పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.
గతంలో బోయపాటి తెరకెక్కించిన ‘దమ్ము’ ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ ‘వినయ విధేయ రామ’ సినిమాలు కలిపి ఈ సినిమాలో చూపించినట్టు ఉంది అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేసారు.. స్కంద సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా తెరకెక్కించారు.. ఈ సినిమా సెప్టెంబర్ 28న ఈ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమానుతెలుగుతో పాటు తమిళ్, మలయాళ , కన్నడ, హిందీ భాషల్లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే స్కంద మూవీ ట్రైలర్ ను కొంతమంది ట్రోల్ చేసిన మాస్ ప్రేక్షకులకు మాత్రం ఈ ట్రైలర్ తెగ నచ్చేసింది.తాజాగా ఈ ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో స్కంద ట్రైలర్ ట్రెండింగ్ అవుతుంది.’స్కంద’ ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో దుమ్ము రేపుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.